యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా ‘సీతా పయనం’. కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ హీరోగా నటించగా, అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. సాయి మాధవ్ బుర్రా తెలుగు డైలాగ్స్ అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
