ఇండియన్ బాక్సాఫీస్‌పై వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏక్ థా టైగర్, వార్, పఠాన్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత... ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఆదిత్య చోప్రా సిద్ధమయ్యారు. ఈ సక్సెస్‌ఫుల్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్, యంగ్ సెన్సేషన్ శార్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్
ఈ ట్రైలర్‌ను చూస్తే.. రామాయణ ఇతివృత్తం స్ఫూర్తితో ఒక సాలిడ్ స్టోరీ లైన్‌ను మేకర్స్ సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. సీత అనే పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో ఆలియా భట్ మునుపెన్నడూ చూడని ఉగ్రరూపం చూపించింది. కేవలం క్యూట్ రోల్స్ మాత్రమే కాదు, డెడ్లీ స్టంట్స్ కూడా చేయగలనని తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నిరూపించింది. గతంలో జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్‌లో ఆమెను కాపాడి, భారతదేశపు తదుపరి తరం సైనికులను తయారు చేసే రహస్య ప్రోగ్రామ్ 'ఆల్ఫా' కోసం సీతను తీర్చిదిద్దిన బాబా పాత్రలో విలక్షణ నటుడు బాబీ డియోల్ అదరగొట్టాడు.
ఇక సీతను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన మరో డేరింగ్ ఇండియన్ ఏజెంట్‌గా శార్వరి తన మార్క్ చూపించింది. ఈ ఇద్దరు భామల మధ్య వచ్చే సీన్స్, తుపాకుల మోతలు, ఇంటెన్స్ యాక్షన్ ఛేజింగ్‌లు సిల్వర్ స్క్రీన్‌పై ఫైర్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వీటన్నింటినీ పర్యవేక్షించే భారత రక్షణ విభాగం కమాండర్‌గా అనిల్ కపూర్ తనదైన స్టైల్‌లో ఇరగదీశారు.
హృతిక్ రోషన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ!
'గొర్రెలా కాదు... తోడేలులా జీవించాలి' అంటూ ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే, ఈ స్పై యూనివర్స్ ఫ్యాన్స్‌కు ట్రైలర్ చివర్లో అదిరిపోయే క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. 'వార్' సిరీస్‌లో కబీర్‌గా థియేటర్లను ఊపేసిన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్... ఈ మూవీలో క్యామియో రోల్‌లో ఎంట్రీ ఇచ్చి ఎక్కడలేని బజ్‌ను క్రియేట్ చేశాడు.
ALSO READ : ఒకే కారులో అమీర్ ఖాన్, ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్య..
'ది రైల్వే మెన్' ఫేమ్ శివ్ రావల్ అద్భుతమైన టేకింగ్‌కు, రోహన్ష్-అబీర్ ద్వయం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ విజువల్ వండర్ 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యాక్షన్, ఎమోషన్, థ్రిల్స్ కలబోతగా వస్తున్న 'ఆల్ఫా' బాక్సాఫీస్ రికార్డులను వేటాడటం పక్కా అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
