
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వార్తలు బలపడుతున్నాయి. విరాట్ అకస్మాత్తుగా టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే సంగతి పక్కనపెడితే.. తన రిటైర్మెంట్ పై కోహ్లీ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. అయితే రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే తన ఆలోచనని బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
అంతేకాదు బీసీసీఐ అధికారులు కోహ్లీ రిటైర్మెంట్ పై సంతోషంగా లేనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చెప్పడం టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ అనుభవం జట్టుకు ఉపయోగపడాలని.. అతడు మరి కొన్నేళ్ల పాటు టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోహ్లీ తన మనసు మార్చుకుంటాడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
తన ఎక్స్ ఖాతా ద్వారా రాయుడు ఇలా రాసుకొచ్చాడు.. " విరాట్ కోహ్లీ దయచేసి మీరు రిటైర్ అవ్వకండి.. భారత జట్టుకు మీ అవసరం ఎప్పుడూ లేనంతగా ఉంది. మీ దగ్గర క్రికెట్ ఆడగల సత్తా ఇంకా చాలా ఉంది. టీమిండియా తరపున పోరాడటానికి మీరు లేకపోతే టెస్ట్ క్రికెట్ కు కళ ఉండదు. మీలాంటి కొంతమంది క్రికెటర్ల వల్ల టెస్ట్ ఫార్మాట్ బతుకుతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి". అని రాయుడు అన్నాడు.
►ALSO READ | T20 World Cup Asia Qualifier: 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్.. గెలుపు కోసం యూఏఈ అతి పెద్ద సాహసం
ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ కూడా రిటైర్ అయితే.. భారత టెస్ట్ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో అంత సీనియర్లు లేకపోవడం భారత్ కు పెద్ద సవాల్. అప్పుడు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ వంటి ఆటగాళ్లపై టీమిండియా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఇప్పటివరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. 46.85 యావరేజ్ తో 9230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Ambati Rayudu has requested Virat Kohli to reconsider his decision to retire from Test cricket. pic.twitter.com/u1aqclladw
— CricTracker (@Cricketracker) May 10, 2025