T20 World Cup Asia Qualifier: 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్.. గెలుపు కోసం యూఏఈ అతి పెద్ద సాహసం

T20 World Cup Asia Qualifier: 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్.. గెలుపు కోసం యూఏఈ అతి పెద్ద సాహసం

క్రికెట్ చరిత్రలో ఎక్కడా జరగని వింత ఒకటి చోటు చేసుకుంది. యూఏఈ మహిళల జట్టు గెలుపు కోసం ఇప్పటివరకూ ఎవరూ చేయలేని రిస్క్ చేసింది. టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో భాగంగా యూఏఈ, ఖతార్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం (మే 10) బ్యాంకాక్‌లోని టెర్డ్‌థాయ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట యూఏఈ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ.. కెప్టెన్ ఇషా ఓజా(113) సెంచరీకి తోడు తీర్థ సతీష్(74) చెలరేగడంతో 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 192 పరుగులు చేసింది.

మరో నాలుగు ఓవర్లు ఆడాల్సి ఉండగా..యూఏఈ మహిళలు ఊహించని పని చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాకింగ్ కు గురి చేశారు. వర్ష సూచన ఉన్నందున మ్యాచ్ రద్దు కాకూడదనే ఉదేశ్యంతో జట్టులోని 10 మంది ఆటగాళ్లు రిటైర్డ్ ఔట్ ప్రకటించారు. జట్టు గెలవటానికి 192 పరుగులు బోర్డు మీద ఉండడంతో ధైర్యంగా తమ జట్టులోని 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ అని సంచలన ప్రకటన చేశారు. కీలక దశలో యూఏఈ జట్టు తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చింది.  

►ALSO READ | Good News : IPL రీ స్టార్ట్ కు లైన్ క్లియర్.. రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ వచ్చే ఛాన్స్

వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఖతార్‌ను 11.1 ఓవర్లలో కేవలం 29 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో యూఏఈ జట్టు ఏకంగా   163 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేశారు. ఖతార్ తరఫున రిజ్ఫా ఇమ్మాన్యుయేల్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇమ్మాన్యుయేల్ మాత్రమే జట్టులో రెండంకెల స్కోర్ చేయడం విశేషం.  ఏడుగురు ఖతార్ బ్యాట్స్‌మెన్ డకౌటయ్యాడు. యుఎఇ తరఫున మిచెల్ బోథా  నాలుగు ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.