
ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా పెద్దన్న పాత్రతో.. రెండు దేశాలు సైనిక చర్యలను నిలిపివేశాయి. ఇక నుంచి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటాం అని ఇప్పటికే భారత్ ప్రకటించేసింది. ఈ క్రమంలోనే.. దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోయాయి.. సాధారణ స్థితికి వచ్చింది. ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటలకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు.
ఇక అందరి దృష్టి ఇప్పుడు IPLపై పడింది. రెండు రోజులుగా ఆగిన మ్యాచులు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. వారం రోజులు వాయిదా వేసిన బీసీసీఐ.. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ పై కసరత్తు ప్రారంభించింది. దీంతో ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. వేదికల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఆగిపోయిన చోటే మళ్ళీ ఐపీఎల్ రీ స్టార్ట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకట వచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ ఎప్పుడు మొదలైనా ఎక్కడ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య గురువారం (మే 7) మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచి పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బ్లాక్ ఔట్ ప్రకటించడంతో మ్యాచ్ మధ్యలో నిలిచిపోయింది. ఈ రెండు జట్ల మధ్య పున ప్రారంభం కానున్న మ్యాచ్ లో మరల టాస్ వేసి మొదటి ఫ్రెష్ గా స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
►ALSO READ | IPL 2025: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌తో పాటు ఆ రెండు వేదికల్లో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లు
గురువారం (మే 7) హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను నిలిపి వేశారు. పాక్ ఆక్మసిక దాడుల నేపథ్యంలో మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. ధర్మశాలలో బ్లాక్ అవుట్ (పూర్తిగా విద్యుత్ నిలిపివేత) ప్రకటించడంతో మధ్యలోనే మ్యాచ్ ఆగిపోయింది. తక్షణమే ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని సూచించారు. పాక్ భీకర దాడులకు పాల్పడుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాచును రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ నిర్వహకులు ప్రకటించారు. హై సెక్యూరిటీ మధ్య ఇరు జట్ల ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.