ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల అంచనాలకు చాలా దగ్గరగా ప్రస్తుతం బంగారం వెండి రేట్లు కొనసాగుతున్నాయి. అయితే రానున్న ఏడాది కూడా ధరలు ఎక్కుడా తగ్గేలా కనిపించటం లేదని వారు అంటున్నారు. బంగారం గ్రాము దాదాపు 14వేలకు చేరుకోగా.. వెండి రెండున్నర లక్షల దగ్గరగా ఉంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు ఇన్వెస్టర్ల నుంచి కొనసాగుతున్న డిమాండ్ దీనికి ప్రధానం కారణం అంటున్నారు నిపుణులు. మరోపక్క వ్యాపారులు కూడా పెరిగిన బంగారం రేట్లతో తక్కువ బరువులో వస్తువుల తయారీ, 18 క్యారెట్ గోల్డ్ వంటి మార్గాలను అన్వేషిస్తున్నారు బిజినెస్ కోసం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 25, 2025న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.32 పెరిగింది. తాజా పెంపు తర్వాత హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 925గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 765గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి కూడా డిసెంబర్ నెలలో భారీ ర్యాలీని కొనసాగించింది. ముఖ్యంగా డిమాండ్ కి తగిన స్థాయిలో సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. దీంతో డిసెంబర్ 25, 2025న వెండి రేటు కేజీకి వెయ్యి పెంపును నమోదు చేసింది. ఈ పెరుగుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 45వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.245 వద్ద ఉంది.
