OMG : వందే భారత్ రైలులోకి పామును వదిలాడు.. ఎవడ్రా నువ్వు దరిద్రుడా.. !

OMG : వందే భారత్ రైలులోకి పామును వదిలాడు.. ఎవడ్రా నువ్వు దరిద్రుడా.. !

పాము.. పాము.. ఇది కనిపిస్తే కాదు.. ఈ మాట విన్నా గుండెలు అదురుతాయి.. భయం కనిపిస్తుంది.. ఉన్న ఫళంగా లేచి పరిగెడుతాం.. నిల్చొని ఉంటే పరుగో పరుగో.. ఎటుపోతున్నాం.. ఎటు వెళ్తున్నాం అని కూడా చూసుకోరు జనం.. పాము అంటే అంత భయం.. అలాంటి పామును.. వందే భారత్ రైలులో వదిలాడు ఓ వెధవ.. దరిద్రుడు.. వందే భారత్ రైలులో పామును వదిలిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

గత ఏడాది డిసెంబర్ 27న ముంబై నుండి సోలాపూర్ వెళ్లే వందే భారత్ రైలు (నెం. 22225) లోని C-16 కోచ్ టాయిలెట్‌లో ఒక పాము కనిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, ఆ టాయిలెట్‌ను మూసివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు సోలాపూర్ స్టేషన్‌కు చేరుకోగానే ఆ పామును పట్టుకొని బయటకు తీశారు.

ALSO READ : మైట్రో స్లాబులు కూలి ఆటోలు, కార్లపై పడ్డాయి.. నడి రోడ్డుపై భయంకరం..

ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ఒక వ్యక్తి టాయిలెట్‌లోకి వెళ్లి పామును వదిలి రావడం రికార్డయ్యింది. సాంకేతిక ఆధారాల సాయంతో నాసిక్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల జగన్ అర్జున్ భలే అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి, ముంబ్రాలో అరెస్ట్ చేశారు.

 రైల్వే చట్టంలోని పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం, అసలు ఆ వ్యక్తి రైలులో పామును ఎందుకు వదిలాడు ? అతని ఉద్దేశ్యం ఏంటి ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇలాంటి పనులు చేయడం నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.