కామారెడ్డి జిల్లాలో 84 వేల 438 మంది ఓటర్లు తగ్గుదల

కామారెడ్డి జిల్లాలో 84 వేల 438 మంది ఓటర్లు తగ్గుదల

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సర్ పక్రియ తర్వాత 84,438 మంది ఓటర్లు తగ్గారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ​నియోజకవర్గాల్లో 6,96,006 మంది ఓటర్లు ఉండగా వీరికి సర్​ పక్రియ ఫారాలు పంపిణీ చేశారు. సోమవారం నిర్దేశిత గడువు ముగిసేలోగా  6,11,568 మంది తమ వివరాలు అందించారు. 84,438 మంది ఫారాలు తిరిగి రాలేదు.

87 శాతం ఓటరు లిస్టు డిజిటైజేషన్ ​పూర్తయినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ​తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో2,61,160 మందికి గాను 83.96 శాతం డిజిటైజేషన్, ఎల్లారెడ్డిలో 2,28,503 మందికి గాను 90.17 శాతం, జుక్కల్​లో 2,06,343 మందికి గాను 90.27 శాతం డిజిటైజేషన్​ పూర్తయినట్లు కలెక్టర్​ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు లిస్టు ప్రచురించనున్నట్లు తెలిపారు.