బల్లార్షా - గూడూరు 4వ రైల్వే లైన్ పనులు స్పీడప్

బల్లార్షా - గూడూరు 4వ రైల్వే లైన్ పనులు స్పీడప్
  • హన్మకొండ, కుమ్రం భీం ఆసిఫాబాద్ లో కాంపిటెంట్ అథారిటీల నియామకం

న్యూఢిల్లీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న బల్లార్షా-కాజీపేట-విజయ వాడ-గూడూరు 4వ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు స్పీదప్ కానున్నాయి. 744.80 కి లోమీటర్ల ఈ ప్రాజెక్టుతో పాటు ఇందుప ల్లి-దుగ్గిరాల 36.80 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులకూ కేంద్ర రైల్వే శాఖ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 2(7ఏ) కింద హన్మకొండ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంపిటెంట్ అథారిటీలను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

హన్మకొండజిల్లాలోకమలా పూర్, ఎల్కతుర్తి, హసన్పర్తి హనుమకొండ, కాజీపేట మండలాలకు హనుమకొండ ఆర్డీవో సుకాంపిటెంట్ అథారిటీగా నియమించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్( టి), కాగజ్నగర్ మండలాల బాధ్యతలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్కు, వాంకిడి, రెబ్బెన మండలాల బాధ్యతలను ఆసిఫాబాద్ ఆర్టీవో కు ఏ అప్పగించింది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ. భూసేకరణ, ఇతర సంబంధిత వ్యవహారాల సు వీరు పర్యవేక్షించనున్నారు.