ఢిల్లీలో నిరసనలు..11 మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో నిరసనలు..11 మెట్రో స్టేషన్లు మూసివేత

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్  రాజీనామా చేయాలని ఢిల్లీలో జరుగుతున్న నిరసనల క్రమంలో ఢిల్లీ  మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.  దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 11 మెట్రో స్టేషన్లను మూసివేసింది. స్టేషన్లలోకి ప్రయాణికుల ప్రవేశం నిషేధించారు. 

భద్రతా కారణాల దృష్ట్యా  ఈ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ స్టేషన్లు ఇవాళ( శుక్రవారం సెప్టెంబర్2) సాయంత్రం 4 గంటల వరకు మూసి ఉంటాయి. ఆ సమయం తర్వాత DMRC నుంచి సమాచారం మేరకుమెట్రో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయి. 

మూసివేసిన మెట్రో స్టేషన్లు ఇవే.. 

జనపథ్ 
కేంద్ర సచివాలయం
మండి హౌస్
రామకృష్ణ ఆశ్రమం
రాజీవ్ చౌక్
పటేల్ చౌక్
సేవా తీర్థ
లోక్ కళ్యాణ్ మార్గ్
ఐఎన్ఏ
న్యూఢిల్లీ
చావ్రి బజార్