ఆధ్యాత్మికం:కార్తీకమాసం రెండో సోమవారం పూజ.. వందరెట్లు ఫలితం..!

ఆధ్యాత్మికం:కార్తీకమాసం రెండో సోమవారం పూజ.. వందరెట్లు ఫలితం..!

పురాణాల ప్రకారం కార్తీక మాసంలో శివుడు, విష్ణువు ఇద్దరూ భూమి మీద సంచరిస్తారని నమ్మకం. ఈ నెలలో శివకేశవులను  పూజిస్తే కోటి పుణ్యం వస్తుంది. ఈ ఏడాది రెండో కార్తీక  సోమవారం ( నవంబర్​ 23)  చతుర్దశి తిథి ఉండటం వల్ల  శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మారింది. ఈ రోజు చేసే అభిషేకం, ఉపవాసం సాధారణ సోమవారం కంటే 100 రెట్లు ఫలితం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.. 

కార్తీక సోమవారం  శివారాధనకు చాలా ముఖ్యమైన రోజని పండితులు చెబుబుతున్నారు. ఈ ఏడాది రెండో సోమవారం( నవంబర్​ 23)  చతుర్దశి కావడంతో ఆ రోజున, శివుడిని భక్తితో  ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, అభివృద్ధి లభిస్తుంది. పరమశివుడిని  స్మరించినట్లయితే, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడు చాలా దయగలవాడు. ఆయన ఒక్క చెంబుడు నీటితో కూడా సంతోషిస్తాడని చెబుతారు.  

  • తెల్లవారుజామున 5 గంటల లోపు లేచి చన్నీటితో స్నానం చేయండి. 
  • నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే ఇంకా మంచిది.
  • ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఏమీ తినలేని వారు పండ్లు, పాలు మాత్రమే తీసుకోండి. 
  • సాయంత్రం శివుడికి పూజ చేసిన తర్వాత నక్త భోజనం (ఒక పూట భోజనం) చేయాలి.

శివుడికి అభిషేకం:

  • శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంగాజలంతో అభిషేకం చేయండి. బిల్వ పత్రాలు (మారేడు దళాలు) తప్పనిసరిగా సమర్పించండి. బిల్వం లేకుండా శివ పూజ పూర్తి కాదు.
  • సాయంత్రం 5:30 గంటలకు తులసి కోట దగ్గర, శివాలయంలో దీపం వెలిగించండి. ఉసిరి కాయ మీద వత్తి పెట్టి వెలిగిస్తే చాలా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

శివుడిని  పూజించేటప్పుడు చదవాల్సిన మంత్రాలు

శివ గాయత్రీ మంత్రం:  ఓం తత్పురుషాయ విద్మహేమహాదేవాయ ధీమహి..తన్నో రుద్ర ప్రచోదయాత్
రుద్ర మంత్రం:  "ఓం నమో భగవతే రుద్రాయ" ( అర్థం: నేను రుద్రునికి నమస్కరిస్తాను.)
మహా మృత్యుంజయ మంత్రం : ''ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం.. ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ముక్షీయమామృతత్''

కార్తీక సోమవారం రోజున శివాలయంలో  ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఆముదంతోగానీ దీపారాధన చేసిన వారు  అత్యంత పుణ్యవంతులౌవుతారని జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది. గత జన్మల్లో చేసిన పాపాలు కార్తీక దీపారాధన వలన కొట్టుకుపోతాయి. ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు  పగటి వేళ ఉపవాస దీక్షను పాటించి.. రాత్రి నక్షత్ర దర్శనం తరువాత  భోజనం చేయాలి.  రోజంతా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు. 
 
జ్యోతిష్య నిపుణులు తెలిసిన వివరాల ప్రకారం కార్తీక మాసం  రెండో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించే వారికి పెళ్లి ఆలస్యం, సంతాన సమస్యలు, అనారోగ్యం, అప్పుల బాధ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఈ రోజున ఈ తప్పు చేయకండి

  • మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి అస్సలు ముట్టుకోవద్దు.
  • ఈ రోజు ఎవరితోనూ గొడవ పడకండి, అబద్ధం చెప్పకండి.
  • సోమవారం వ్రతం ఉన్నవారు రాత్రి పడుకోవడానికి మంచం కాకుండా నేల మీద పడుకోవడం మంచిది.


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.