జీవీ.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మించారు. ఈనెల 27న సినిమా రిలీజ్ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.
సినిమాలో తాము కాకుండా పాత్రలే కనిపించేంత గొప్పగా దర్శకుడు తెరకెక్కించాడని సీనియర్ నటులు ప్రసాద్ బాబు, నరసింహరాజు, జయలలిత, రజన్ హరి చెప్పారు. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న బెన్నీ (కమెడియన్ సుధాకర్ కొడుకు).. సీనియర్స్‌తో కలిసి నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు.
ఎస్‌కే పిక్చర్స్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘టికెట్ రేట్ కేవలం 100 రూపాయలే పెడుతున్నాం. 60 ఏళ్ళు దాటిన సీనియర్స్ తొలి మూడు రోజులు ఆధార్ చూపించి ఫ్రీగా చూడొచ్చు’ అని చెప్పారు. పెద్దలతో పాటు యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని దర్శకనిర్మాతలు తెలియజేశారు. హీరోయిన్ జెస్సీ, నటీనటులు అనుపమ, మాధవి, ప్రసాద్‌రావు, మ్యూజిక్ డైరెక్టర్ వియాన్, డీవోపీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
