జ్యోతిష్య శాస్త్రం నక్షత్రాలు.. రాశుల ఆధారంగా గ్రహాల కదలికలను బట్టి పండితులు చెబుతుంటారు. ఏ గ్రహం .. ఏరాశిలో సంచరిస్తుంది. ఏ నక్షత్రంలో ఉంది .. అనే విషయాలను ఆధారంగా చేసుకొని వ్యక్తిగత జాతకం ఎలా ఉందో జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో సంచరిస్తున్నప్పుడు అదృష్టం కలిసి వవస్తుంది. ప్రస్తుతం రాహువు.. కుంభ రాశిలో 2026 డిసెంబర్ 5 వ తేదీ వరకు సంచరిస్తడని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. దీని ప్రభావం వలన ఆరు రాశుల (మేష వృషభ, సింహ, కన్య,ధనస్సు, మీన) వారికి అన్ని విధాలా కలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .!
మేష రాశి: ఈ రాశికి 11 వస్థానంలో ... కుంభరాశిలో రాహువు సంచారం వలన ఈ రాశి వారికి ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార వర్గాలకు అత్యంత ఫలవంతంగా ఉండబోతోందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. . నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: రాహువు కుంభ రాశిలో.. ఈ రాశికి పదో స్థానంలో సంచారం వలన ఈ రాశి వారికి
కొంతకాలంగా ఎదురవుతున్న కష్టాలకు ఇప్పుడు ముగింపు దశ ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు. వృత్తి పరంగా చేసిన ప్రయత్నాలు ఫలించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త బాధ్యతలతో పాటు మంచి అవకాశాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతులు రావడం.. ఆదాయం పెరిగే వార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాలు పొందే పరిస్థితి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రాహువు కుంభరాశిలో సంచారం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
సింహ రాశి : రాహువు కుంభరాశిలో సంచరించే కాలంలో ఈ రాశి వారికి అదృష్టం తోడై పెండింగ్లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ జీతం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వృత్తి .. వ్యాపారస్తులకు ఆదాయం భారీగా పెరుగుతుంది.ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. అనేక విధాలుగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లికోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
కన్య రాశి: ఈ రాశికి ఆరోస్థానంలో రాహువు కుంభరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి దీర్ఘకాలంగా నిలిచిపోయిన విషయాల్లో కదలిక వస్తుంది. న్యాయపరమైన వ్యవహారాలు, అధికార సంబంధిత పనులు లేదా ఇతర సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి అవకాశాలొస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ కాలం అనుకూలంగా మారవచ్చు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఈ యోగంతో కలిసివస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
ధనస్సు రాశి: కుంభరాశిలో రాహువు.. ఈరాశికి మూడో స్థానంలో సంచారం వలన ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అదృష్టం అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు ఈ కాలం ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా రోజులుగా ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెరిగి ఖర్చులపై నియంత్రణ సాధించే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపించి ఆనందం పెరుగుతుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.
మీన రాశి: రాహువు కుంభరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఈ సమయం కెరీర్ పరంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చు. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి.ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
