జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు విశాఖ నక్షత్రంలో సంచరించేటప్పుడు.. అది మరింత శక్తివంతమై అదనపు ప్రయోజనాలను ఇస్తుంది. నవంబర్ 25 మధ్యాహ్నం 1:44 గంటలకు బుధుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 4 వరకు ఈ నక్షత్రంలో సంచరిస్తాడు. బుధుడు విశాఖ నక్షత్రంలో సంచరించే ఈ కాలంలో ఐదు రాశుల వారికి పురోగతిని, కొత్త అవకాశాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
వృషభరాశి: బుధుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో దూసుకుపోయే అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చాలాకాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదాలు తొలగిపోయి, కొత్త స్థిరాస్తులు కొనుగోలు చేసేయోగం ఉంది. ఈ రాశివారికి ఈ కాలం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు మీ సొంతమవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. పదోన్నతులు లేదా వేతన సవరణకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా ఊహించని మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సురాశి: విశాఖ నక్షత్రంలో బుధుడి సంచారం వలన ఈ రాశి వారికి ఈ కాలం కాసుల వర్షం కురిపించనుంది. పెద్దగా శ్రమ పడకుండానే అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా నెరవేరుతాయి. అదృష్టం కూడా రెట్టింపు కాబోతోంది. వ్యాపారస్తులకు బోలెడు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు హోదా పెరుగుతుంది.పెద్ద ప్రాజెక్ట్ లేదా కీలకమైన అవకాశం ద్వారా ఆదాయం పెరగవచ్చు. ప్రేమ, దాంపత్య జీవితంలోనూ భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: బుధుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. భౌతిక సుఖాలు పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రతి విషయాన్ని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆలోచించరు. ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, అందర్నీ కలపడం కోసం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆస్తి వివాదాలు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. గృహ యోగం పడుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచీలు ప్రారంభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
మకరరాశి: బుధుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో జీవితంలో సానుకూల పరిస్థితులు పెరిగి, కొత్త ఆలోచనలు మనసులో ఉద్భవిస్తాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.
మీనరాశి: బుధుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గుతాయి. అన్ని పనుల్లోనూ అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.ఊహించని విధంగా కొత్త అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్ట్ లేదా కీలకమైన అవకాశం ద్వారా ఆదాయం పెరగవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
