తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ' ఈఎన్ఈ రిపీట్' ( ENE Repeat ) బాక్సాఫీస్ దూసుకెళ్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, కల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న 'ఈ నగరానికి ఏ మైంది' మూవీకి సీక్వెల్ గా వచ్చిన 'ఈఎన్ఈ రిపీట్' తొలి రోజు ( నవంబర్ 19, 2026 ) అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ ట్రెడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు, 2018లో విడుదలైన మొదటి భాగం జీవితకాల వసూళ్లను కేవలం ఒక్క రోజులోనే అధిగమించామని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమైంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల్లో వసూళ్ల లెక్కలు కొంత భిన్నంగా ఉన్నాయి.
ఈ సీక్వెల్‌లో మరోసారి విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. పాత గ్యాంగ్ మళ్లీ ఒక్కటై, కొత్త ప్రయాణంలో చేసే హంగామా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. స్నేహం, సరదాలు, ఊహించని పరిణామాలతో కథ ముందుకు సాగుతుంది.
ముఖ్యంగా సినిమా మొదటి భాగంతో ఏర్పడిన అనుబంధం, పాత్రలపై ప్రేక్షకులకు ఉన్న అభిమానమే ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారింది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం, తరుణ్ భాస్కర్ మార్క్ హ్యూమర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రెండో రోజు, వీకెండ్‌లోనూ ఇదే జోరును కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. తొలి రోజే ఇంతటి వసూళ్లు సాధించిన 'ఈఎన్‌ఈ రిపీట్' ఫుల్ రన్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
A film made for the people now being celebrated by the people ❤️ #ENERepeat scores 15.27 Crore+ Worldwide Gross on Day 1 💥💥 Surpassing the lifetime collections of #EeNagaranikiEmaindi Part 1 on Day 1 itself ❤️🔥 #BlockbusterENERepeat #ENE2 #TharunBhascker @VishwakSenActor @AbhinavGomatam @maganti_srinath #VenkateshKakumanu @anishaambrose @ShivathmikaR #VivekSagar @SOriginals1 @rootnodecinema @EneRepeat @thinkmusicindia
— ENE Repeat (@ENERepeat) November 20, 2026
