టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ జీవితంలోకి వచ్చిన చిన్నారికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టింది. ఈ శుభవార్తను ఈ జంట సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నవంబర్ 19న జననం.. 20న ప్రకటన
సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19, 2026న మగబిడ్డ జన్మించాడు. నవంబర్ 20న ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ చిన్నారి చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'మా అందమైన చిన్నారి.. దేవ్ నిడిమోరు. 19.11.2026. మా హృదయాలు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాయి' అంటూ సమంత, రాజ్ ఎమోషనల్ క్యాప్షన్ జోడించారు.
డిసెంబర్ 2025లో వివాహం..
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ ఏడాది జూన్‌లో తాను తల్లి కాబోతున్నట్లు సమంత వెల్లడించగా.. తాజాగా తల్లి ప్రమోషన్ రావడంతో అభిమానులు విషెస్ చెబుతున్నారు.
అభిమానుల శుభాకాంక్షలు..
సమంత తల్లిగా మారిన వార్త తెలియడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. తల్లిగా ఆమె కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న సమంతకు ఈ గుడ్ న్యూస్‌తో మరింత సంతోషాన్ని తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలు..
బిడ్డ రాకకు ముందు సమంత కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక నిర్వహించారు. రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆమెకు ఆశీర్వాదాలు అందించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాజ్ సోదరి శీతల్ నిడిమోరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
