మేడ్చల్ జిల్లా: కీసర మండలం నాగారం పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కాలనీలో పార్కు స్థలం, ఓపెన్ స్పేస్ ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
స్థానికుల ఫిర్యాదు ప్రకారం.. 2016లో కాలనీకి కేటాయించిన 2,700 గజాల పార్కు స్థలంలో 1,122 గజాల మేర ఆక్రమణ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన హైడ్రా అధికారులు గురువారం తెల్లవారుజామున శ్రీనివాస్ నగర్ కాలనీకి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పార్కు స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడను కూల్చివేశారు.
ALSO READ : భాక్రానంగల్ కాల్వపై కూలిన ఇనుప బ్రిడ్జి..
కాలనీలోని పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి పరిరక్షించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కులు, ఓపెన్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
