స్టార్ హీరో సూర్యతో మ్యాచో స్టార్ గోపీచంద్ ఢీకొట్టబోతున్నారంటూ వచ్చిన వార్తలకు ఆయన టీమ్ తెరదించింది. సూర్య నటిస్తున్న తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా కనిపించనున్నారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలకు గోపీచంద్ టీమ్ ఫుల్స్టాప్ పెట్టింది. మరి ప్రస్తుతం గోపీచంద్ ఏ సినిమాలతో బిజీగా ఉన్నారు? అటు సూర్య తదుపరి ప్రాజెక్టులేంటి? ఓ లుక్కేద్దాం..
విలన్ రోల్‌పై టీమ్ క్లారిటీ..
సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని కళైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారనే వార్తలతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని గోపీచంద్ టీమ్ స్పష్టం చేసింది. తమిళ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారన్న వార్తలు అవాస్తవమని పేర్కొంటూ, ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దని మీడియా, సోషల్ మీడియా వర్గాలను కోరింది. భవిష్యత్తు సినిమాల వివరాలను అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది.
భరతవర్ష', 'సింగ'తో బిజీగా గోపీచంద్..
ప్రస్తుతం గోపీచంద్ తన తదుపరి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ ‘భరతవర్ష: సాగా ఆఫ్ శూల’లో నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా కనిపించనున్నారు. మరోవైపు ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింగ’లోనూ నటిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టులోనూ గోపీచంద్ బిజీగా ఉన్నారు. మొత్తానికి విలన్ రూమర్స్‌ను పక్కనపెట్టి, హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ALSO READ : మన సంస్కృతిని ఎప్పటికీ తక్కువ చేయను..
వరుస సినిమాలతో సూర్య బిజీ..
మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య కూడా తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే 49వ సినిమాకు సంబంధించి దర్శకుడు మతిమారన్ పుగళేంధితో ఆయన పేరు వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి సూర్య సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారన్న ప్రచారానికి తెరపడగా.. ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలపై ఫోకస్ పెట్టారు.
