రూ.11వేల స్థాయికి 22 క్యారెట్ గోల్డ్.. 10 రోజుల్లో కేజీకి రూ.25వేలు తగ్గిన వెండి

రూ.11వేల స్థాయికి 22 క్యారెట్ గోల్డ్.. 10 రోజుల్లో కేజీకి రూ.25వేలు తగ్గిన వెండి

బంగారం వెండి రేట్ల విరుగుడు రోజురోజుకూ ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. అవును ఈ ఏడాది మెుదట్లో సామాన్యులకే కాకుండా సంపన్నులకు కూడా చుక్కలు చూపించిన వీటి రేట్లు ప్రస్తుతం పాతాళానికి పడిపోతున్నాయి. వడ్డీ రేట్ల పెరుగుదలతో వీటిలో డబ్బులు పెట్టే ఇన్వెస్టర్లు లేకపోవటం బులియన్ మార్కెట్లను భేజార్చుతోంది. ఈ క్రమంలో కార్తీకమాసంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు ఫ్యామిలీస్ ముందుగా తమ సమీప నగరాల్లో తగ్గిపోయిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

నవంబర్ 19న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 257 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 069గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 980గా కొనసాగుతోంది. 

ALSO READ : వెండి ధర కుప్పకూలింది : జనవరిలో 4 లక్షలు.. ఇప్పుడు లక్షా 90 వేలు మాత్రమే..!

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 19, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 80వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.180 దగ్గర ఉంది. గడచిన 10 రోజుల్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు తగ్గటంతో.. భవిష్యత్తులో రేట్లు ఇంకా క్రాష్ అవ్వొచ్చని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.