కేంద్ర బలగాల్లో ఎస్ఐ పోస్టులు .. 1167 పోస్టులతో బీఎస్ఎఫ్ నోటిఫికేషన్

కేంద్ర బలగాల్లో ఎస్ఐ పోస్టులు .. 1167 పోస్టులతో బీఎస్ఎఫ్ నోటిఫికేషన్

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), న్యూఢిల్లీ లిమిటెడ్ డిపార్ట్​మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్​డీసీఈ)– - 2026 ద్వారా బీఎస్ఎఫ్, సీఆర్​పీఎఫ్, ఎస్ఎస్​బీ, ఐటీబీపీల్లో ఎస్ఐ  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1,167 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.  డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,167 (అన్ రిజర్వ్డ్  913, ఎస్సీ 167, ఎస్టీ 67).
విభాగాల వారీగా ఖాళీలు: సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ)– బీఎస్ఎఫ్​235, సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ)–సీఆర్​పీఎఫ్ 377, సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ)-– ఎస్ఎస్​బీ 125, సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ)-–ఐటీబీపీ 430.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
సర్వీస్ అర్హత: బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీల పరిధిలో సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్(ట్రేడ్స్​మెన్), హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), ఏఎస్ఐ (జనరల్ డ్యూటీ), ఎస్ఎస్‌బీకి చెందిన ఏఎస్ఐ (జనరల్ డ్యూటీ) అర్హులు. బేసిక్ ట్రైనింగ్‌తోపాటు కనీసం నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీసు పూర్తి చేసి, క్లీన్ సర్వీస్ రికార్డ్ కలిగి ఉండాలి. 
వయసు: 32 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 12.
లాస్ట్ డేట్: డిసెంబర్ 31.
సెలెక్షన్ ప్రాసెస్: స్టేజ్–I రాత పరీక్ష, స్టేజ్–II ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ bsf.mha.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్ 

కంప్యూటర్ బేస్డ్  రాత పరీక్షలో  ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు,  జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఇంగ్లిష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.  

రాత పరీక్షలో అర్హత సాధించాలంటే అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 45 శాతం మార్కులు, మొత్తం కలిపి (అగ్రిగేట్) 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మార్కుల విషయంలో 5 శాతం సడలింపు కల్పించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక ప్రమాణ పరీక్ష (పీఎస్ టీ), శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ) వైద్య పరీక్ష,  నిర్వహిస్తారు.

– వెలుగు, ఎడ్యుకేషన్