సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 2 

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 2 

విద్యార్థులు , వారి పేరెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రానే వచ్చింది.  సోమవారం (నవంబర్ 16) నేషనల్  టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్​ విడుదల చేసింది. 6వతరగతి, 9వ తరగతుల్లో ప్రవేశాలకు  ఈ నోటిఫికేషన్​ ద్వారా పరీక్షలునిర్వహిస్తారు. నవంబర్​ 3నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. డిసెంబర్​ 2 వరకు అప్లయ్​ చేసుకోవచ్చు. రూ. 500 ల లేట్ ఫీజుతో డిసెంబర్​ 6వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవర 31,2027న  సైనిక్​ స్కూల్​ఎంట్రన్స్​ టెస్ట్​ నిర్వహించనున్నారు. 

ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2026
లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి తేదీలు: డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 6, 2026 (లేట్ ఫీజు రూ. 500)
ప్రవేశ పరీక్ష తేదీ: జనవరి 31, 2027

ప్రవేశ వివరాలు:

తరగతులు: 6వ తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశాలు
అధికారిక వెబ్‌సైట్: దరఖాస్తు చేసుకోవడానికి ,పూర్తి వివరాల కోసం NTA AISSEE పోర్టల్ సంప్రదించవచ్చు.