ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్‌గా జయ్ షా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026 నవంబర్ 16న ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ICC బోర్డు, కమిటీ సమావేశాల్లో డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జయ్ షా తొలిసారి 2024లో ICC చైర్మన్‌గా ఎన్నికయ్యారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే మూడో టర్మ్‌కు బోర్డు సభ్యులు వ్యతిరేకించిన తర్వాత జయ్ షా ఆ పదవి చేపట్టారు. 38 ఏళ్ల వయసులో ICC చరిత్రలో చైర్మన్ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడుగా జయ్ షా రికార్డుకెక్కారు. జగ్మోహన్ డాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ తర్వాత ICC అధిపతి అయిన ఐదో భారతీయుడు జయ్ షా.
ICC బోర్డు నాపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కోసం మెంబర్‌లతో కలిసి నిబద్ధతతో పనిచేస్తాను అని నియామకం తర్వాత ట్వీట్ చేశారు. లాస్ ఏంజిల్స్ -28 ద్వారా ఒలింపిక్స్‌లోకి క్రికెట్ తిరిగి చేరుకోవడం ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.
జయ్ షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కెరీర్ 2009లో గుజరాత్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి మొదలైంది. 2019లో BCCI ఆనరరీ సెక్రటరీగా ఎన్నికయ్యారు . అప్పటికి ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడు. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్పర్సన్‌గా కూడా సేవలందించారు.
BCCI సెక్రటరీగా ఆయన పదవీకాలంలో IPL మీడియా రైట్స్ రికార్డు డీల్, Womens Premier League (WPL) లాంచ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన, టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగాయని BCCI గతంలో తెలిపింది.
