WPL మ్యాచ్లన్నీ వాంఖడేకు షిఫ్ట్

WPL మ్యాచ్లన్నీ వాంఖడేకు షిఫ్ట్

ముంబై: మహిళల ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌‌పై  బీసీసీఐ కీలక అప్​డేట్​ ఇచ్చింది.  ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌‌ల వేదికను మార్చింది. తొలుత ఈ మ్యాచ్‌‌లను బ్రబోర్న్‌‌ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా వాంఖడే స్టేడియానికి షిఫ్ట్​ చేసినట్లు ప్రకటించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్స్‌‌ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మ్యాచ్‌‌ల తేదీలు, షెడ్యూల్‌‌లో ఎలాంటి మార్పు లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. డబ్ల్యూపీఎల్ 2027 సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. 

డిపెండింగ్​ ఛాంపియన్ ఆర్సీబీ, మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌‌లో తలపడనున్నాయి. (ఫస్ట్ ఫేజ్​ లో 11 మ్యాచ్‌‌లు) జనవరి 14 నుంచి 24 వరకు వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరుగుతాయి. అనంతరం అదే నెల 26 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగే (12వ మ్యాచ్ నుంచి 20వ మ్యాచ్), అలాగే ఎలిమినేటర్, ఫైనల్ సహా మొత్తం 11 మ్యాచ్‌‌లకు వాంఖడే స్టేడియం వేదిక కానుంది.