సంఖ్యా జ్యోతిష్య శాస్త్రంలో అంకెలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి అంకెకు మూల సంఖ్య ఉంటుంది. ఆ మూల సంఖ్య ఏదో ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. ఏ నెలలోనైనా 8, 17 , 26వ తేదీలలో జన్మించిన వారి మూలాంకం 8 గా పరిగణిస్తారు. ఈ తేదీలలో జన్మించిన వారు శని భగవానుడి ఆశీస్సులతో సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారని సంఖ్యా శాస్త్రనిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 8 సంఖ్యకు శనేశ్వరుడు ఆధిపత్యం వహిస్తాడు. శని కర్మ, న్యాయం, బాధ్యత కష్టపడే తత్వానికి ప్రతీక అని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యం ప్రకారం 8, 17 , 26వ తేదీలలో జన్మించిన వారు సమాజంలో గుర్తింపు కలిగిఉంటారని పండితులు చెబుతున్నారు.
ఈ తేదీల్లో పుట్టినవారి వ్యక్తిగత జీవితం ఎత్తుపల్లాలతో కూడి ఉంటుంది.అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. అయినప్పటికీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.
ధైర్యసహసాలు ఎక్కువ: 8 మూల సంఖ్య కలిగిన తేదీల్లో జన్మించిన వారికి ధైర్య సాహసాలు ఎక్కువుగా ఉంటాయి. వీరు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రశాంతంగా ఆలోచిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమను తాము సమన్వయం చేసుకుంటారు. శని ప్రభావం వల్ల వీరిలో క్రమశిక్షణ, వేచి చూసే గుణం బలంగా ఉంటాయి. ఈ సంయమనే దీర్ఘకాలంలో వీరికి తిరుగులేని విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఓటమిని అంగీకరించరు: జీవితంలో ఎంతటి కష్టం వచ్చిన వెనకడుగు వేయరు. కష్టంగా ఉన్నా కాని కొత్తగా ఆలోచించి విజయాన్ని అందుకోవడాని ప్రయత్నిస్తారు. పనిలో వస్తున్న ఆటంకాల విషయంలో కుంగిపోకుండా పొరపాటు ఎక్కడ జరిగిందో అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరి ఆత్మవిశ్వాసం ఎక్కడా సడలకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తారు.
దూర దృష్టి ఆలోచనా విధానం: ఏ నెలలోనైనా 8, 17 , 26 తేదీలలో జన్మించిన వారు ఏదైనా పని చేసేటప్పుడు దాని వలన లాభం ఎంత ఉంటుంది.. ఆ పని చేయడానికి ఎంత కష్ట పడాలి.
ప్రస్తుత పరిస్థితిని చూసి ఎలా ఉంది. మొదలగు విషయాలను ముందే అంచనా వేయడంలో దూరు దృష్టి కలిగి ఉంటారు.
నిజాయితీతో రాజీ పడరు: వీరికి అప్పగించిన పని నూటికి నూరు శాతం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరులకు సాయపడటంలో వీరికి వీరే సాటి. షార్ట్‌కట్ పద్ధతుల ద్వారా విజయం సాధించాలని వీరు ఎప్పటికీ కోరుకోరు. కేవలం నిరంతర శ్రమ, క్రమశిక్షణే తమను ఉన్నత స్థాయికి చేర్చుతాయని నమ్ముతారు. పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని వీరు సహించలేరు.
కొందరు అపార్థం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, తమ విధులను నిర్వహించడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు. శని దేవుని అనుగ్రహం పొందాలంటే కర్మ, నిజాయితీ అత్యంత ముఖ్యమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ లక్షణాలే వీరిని జీవితంలో అగ్రగామిగా నిలబెడతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
