జవహర్లాల్ నెహ్రూ టెక్నాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4.
విద్యార్హతలు
ల్యాబ్ అసిస్టెంట్ -వెర్టికల్-I: మెకానికల్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్, ఆటోమేషన్ ఇంజినీరింగ్, రోబోటిక్స్ లేదా సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా లేదా బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.
ల్యాబ్ అసిస్టెంట్ -వెర్టికల్-VI: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మెకాట్రానిక్స్ లేదా సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా లేదా బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. ఈవీ ల్యాబ్స్, బ్యాటరీ టెస్టింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఈవీ పరిశ్రమల్లో1-2 ఏళ్ల అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ jntuh.ac.inను సందర్శించండి.
