హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా బీఎం సందీప్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీఎం సందీప్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
అయితే ఈ మార్పుతో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల బాధ్యతలు బీఎం సందీప్ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, నాయకుల మధ్య సమన్వయం, సంస్థాగత బలోపేతం వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.
