Team India Playing XI: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 244 పరుగుల భారీ తేడాతో ఓడిన తర్వాత టీమిండియా ఐదో వన్డే కోసం తుది జట్టులో కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2–1 ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ, చివరి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఇండియన్ టీమ్ తప్పనిసరిగా ఐదో వన్డేలో గెలిచి తీరాల్సిందే.. ఈ నేపథ్యంలో లాస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ప్లేయింగ్ ఎలెవన్ లోకి డేంజరస్ ప్లేయర్స్ ని తీసుకొచ్చేందుకు చూస్తోంది.
తుది జట్టులో మార్పులు:
నాలుగో వన్డేలో బౌలింగ్ విభాగం పూర్తిగా ఫెయిల్ కావడం, ముఖ్యంగా స్పిన్నర్ల ప్రదర్శన నిరాశపరచడంతో ఐదో వన్డేలో ప్రక్షాళన తప్పనిసరి అయింది.
* కుల్దీప్ యాదవ్ స్థానంలో యష్ ఠాకూర్: నాలుగో వన్డేలో కుల్దీప్ యాదవ్ తన 8 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకుని వికెట్లేమీ తీయలేకపోయాడు. కండిషన్స్‌కు తగినట్లుగా అదనపు పేసర్ లేదా ఆల్‌రౌండర్ రూపంలో యష్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
* గుర్నూర్ బార్ స్థానంలో సిరాజ్: గుర్నూర్ బార్ 10 ఓవర్లలో 69 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ, ప్రత్యర్థి బ్యాటర్‌తో జరిగిన వివాదంతో జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ ని తుది జట్టులోకి తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
సిరీస్ కైవసం కావాలంటే ఇవి చాలా ముఖ్యం:
టాప్ ఆర్డర్ బ్యాటర్లు (రోహిత్, కోహ్లీ, అయ్యర్) గత మ్యాచ్‌లో డకౌట్ అయిన వైఫల్యాన్ని మర్చిపోయి మళ్లీ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. కివీస్ గడ్డపై ఏడేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడం భారత జట్టుకు చాలా ముఖ్యం.
ఐదో వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యష్ ఠాకూర్, ఆకీబ్ నబీ.
