బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజుల్లో బంగారం ధర రూ.6,536 తగ్గింది. కార్తీక మాసంలో కూడా అడపాదడపా పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. ఏడు నెలల తర్వాత 10 గ్రాముల బంగారం ధరలు ₹1.36 లక్షల కంటే పడిపోయాయి. చివరిగా.. మార్చి 23, 2026న, బంగారం ధర ₹1,35,141కి పడిపోయింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 10 గ్రాముల 24-క్యారెట్ బంగారం ధర ఒక రోజు క్రితం ₹1.38 లక్షల నుంచి నేడు (శుక్రవారం) ₹1,808 తగ్గి ₹1,35,884కు చేరింది.
జనవరి 8, 2026న, బంగారం ధర ₹1,35,773గా ఉంది. గురువారం నాటి ₹1.81 లక్షల నుండి కిలో వెండి ధర ₹3,540 తగ్గి ₹1.77 లక్షలకు పడిపోయింది. వరుసగా మూడు రోజుల్లో బంగారం ధర ₹6,536, వెండి ధర ₹8,500 తగ్గాయి. నవంబర్ 10న, 10 గ్రాముల బంగారం ధర ₹1.42 లక్షలు, కిలో వెండి ధర ₹1.86 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, పెద్ద పెట్టుబడిదారులు అధిక ధరలకు అమ్మడం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.
మన దేశంలో ప్రజల ఇళ్లలో దేశ జీడీపీ కంటే ఎక్కువ బంగారం ఉంది. దేశ జీడీపీ ₹370 లక్షల కోట్లు కాగా, ఇండ్లలో ₹450 లక్షల కోట్ల విలువైన 34 వేల 600 టన్నుల బంగారం ఉంది. భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం విలువ 5 ట్రిలియన్ డాలర్లను (₹450 లక్షల కోట్లు) దాటింది. ఈ మొత్తం దేశ జీడీపీ అయిన 4.1 ట్రిలియన్ డాలర్లు, లేదా ₹370 లక్షల కోట్ల కంటే ఎక్కువ. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలే దీనికి కారణం.
►ALSO READ | ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్: ఇన్సూరెన్స్, మూవీ బెనిఫిట్స్ కట్.. ఆ ఛార్జీలు పెంపు!
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. భారతీయ కుటుంబాల దగ్గర సుమారు 34,600 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుతం, 10 గ్రాముల బంగారం విలువ సుమారు ₹1.38 లక్షల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఔన్సు (దాదాపు 28 గ్రాములు) బంగారం ధర $4,500 కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. దీనిని రూపాయలలోకి మార్చినప్పుడు, 10 గ్రాముల దాని విలువ సుమారుగా ₹1.30 లక్షలు ఉంటుంది.
