బంగారం ధరలు రోజురోజుకూ పతనం అవుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీపావళి పండుగ ముగిసిన తర్వాత ఊహించని రీతిలో గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయి. దీంతో గడచిన నాలుగు రోజుల్లోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులం రూ.5వేల 600 తగ్గింది. పరిస్థితులు చూస్తుంటే రేట్లు ఇంకా తగ్గేలా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు కొనాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమకు సమీపంలోని నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం బెటర్.
నవంబర్ 13న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 131 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 849గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 695గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 13, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.200 దగ్గర ఉంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గొచ్చని అంచనా.
