రేపే భారత్ vs న్యూజిలాండ్ 4వ వన్డే.. ఫోన్లో, టీవీలో మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసా!

రేపే భారత్ vs న్యూజిలాండ్ 4వ వన్డే.. ఫోన్లో, టీవీలో మ్యాచ్ ఎక్కడ చూడాలో తెలుసా!

IND vs NZ 4th ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ చివరి దశకు చేరుకుంది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో, ఇప్పుడు క్రికెట్ అభిమానుల కళ్లన్నీ నాలుగో వన్డేపైనే ఉన్నాయి. ఇప్పటికే సిరీస్ లో 2–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలంటే కివీస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 

రోహిత్, కోహ్లీలపైనే అభిమానుల కళ్లు:  

* మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ తీసుకున్నప్పటికీ, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్ రద్దు అయింది. దీంతో భారత్‌ చేతిలో సిరీస్ ఓడిపోయే ప్రమాదం నుంచి బ్లాక్ క్యాప్స్ టీమ్ తప్పింది. ఇక రేపు (2026, నవంబర్ 13, శుక్రవారం) జరగనున్న నాలుగో వన్డేలో సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2–2తో సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉండటంతో బే ఓవల్ స్టేడియంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనోస్తోంది. 

నాలుగో వన్డే ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే: 

* తేదీ: నవంబర్ 13, 2026 (శుక్రవారం) 

* వేదిక: బే ఓవల్ స్టేడియం, మౌంట్ మౌంగనుయ్ (న్యూజిలాండ్)

* టాస్ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:00 గంటలకు

* మ్యాచ్ ప్రారంభం: ఉదయం 7:30 గంటలకు (IST)