అనిరుధ్, కావ్య పాప పెళ్లయిందోచ్.. ఈ మ్యూజిక్ డైరెక్టర్కు పిల్లనిచ్చిన మామ ఆస్తి ఎంతో తెలుసా..?

అనిరుధ్, కావ్య పాప పెళ్లయిందోచ్.. ఈ మ్యూజిక్ డైరెక్టర్కు పిల్లనిచ్చిన మామ ఆస్తి ఎంతో తెలుసా..?

యువ సంగీత దర్శకుడు అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ పెళ్లి గ్రీస్లో అట్టహాసంగా జరిగింది. 2026 నవంబర్ 11, బుధవారం గ్రీస్‌లో కావ్య మారన్, అనిరుధ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకున్నారు. ఈ పెళ్లి ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనిరుధ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ, “నా జీవితంలో ఒక్కసారే దొరికే అద్భుతమైన వ్యక్తి నువ్వు.. ఒక్కసారికే కాదు, జీవితాంతం నువ్వే నా సొంతం కావాలి.” ❤️ అని అనిరుధ్ హార్ట్ ఎమోజీని జతచేసి కావ్యపై తన ప్రేమను చాటుకున్నాడు.

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కు ఇరు కుటుంబాలతో పాటు.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఐశ్వర్య రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌తో సహా సన్నిహితులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. అనిరుధ్, కావ్య తమ ప్రేమ బంధాన్ని మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగానే ఉంచారు.

అనిరుధ్‌, కావ్య ఇద్దరూ లాస్ వెగాస్‌లో కలిసి కనిపించడంతో వీరి ప్రైవేట్ లవ్ కాస్తా పబ్లిక్కు తెలిసిపోయింది. 2024లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందనే పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ఈ పుకార్లను ఖండించకపోవడంతో వీరి ప్రేమ బంధం వార్తలకు మరింత బలం చేకూరింది. ఫైనల్గా ఈ పుకార్లే నిజమై అనిరుధ్, కావ్య మారన్ 2026 నవంబర్ 11న పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో యూత్ను ఉర్రూతలూగించిన అనిరుధ్.. 'జైలర్', 'విక్రమ్', 'లియో', 'జవాన్', 'జైలర్ 2' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు చార్ట్‌బస్టర్ పాటలను అందించి తనకంటూ ఒక సంగీత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.

తెలుగులో కూడా అజ్ఞాతవాసి, నాని గ్యాంగ్ లీడర్, జెర్సీ, దసరా, దేవర, ది ప్యారడైజ్, లోకేష్- కనగరాజ్-అల్లు అర్జున్ సినిమాకు సంగీతం సమకూర్చుతూ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇక.. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన కావ్య, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్కు ఒక్కగానొక్క కూతురు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి. దాదాపు 30 వేల కోట్ల సంపద కావ్య మారన్ సొంతం. వేల కోట్ల అధినేత అయిన కళానిధి మారన్కు అనిరుధ్ అల్లుడు కావడం విశేషం.