ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుకు బెంగళూరులో ఆపరేషన్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుకు బెంగళూరులో ఆపరేషన్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు బెంగుళూరులో సర్జరీ జరిగింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బుధవారం ( నవంబర్ 11 ) తనకు బెంగుళూరులోని కిమ్స్ ఆసుపత్రిలో థైరాయిడెక్టమీ ఆపరేషన్ జరిగిందని వెల్లడించారు రఘురామ. తనకు తరచూ కిడ్నీలో రాళ్ల సమస్య వస్తోందని.. ఇందుకు కారణమైన పారాథైరాయిడ్ గ్లాండ్ ను ఆపరేషన్ ద్వారా తొలగించారని తెలిపారు రఘురామ.

తరచూ కిడ్నీలో రాళ్లు రావడానికి పారాథైరాయిడ్ గ్లాండ్ కారణమని డాక్టర్లు నిర్దారించారని.. బెంగుళూరు కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ సందీప్ నాయక్ ఆధ్వర్యంలో తనకు సర్జరీ జరిగిందని తెలిపారు రఘురామ.

ALSO READ : మైనార్టీలు, దళితుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి 

సర్జరీ తర్వాత కోలుకుంటున్నానని.. తన పట్ల కేర్ చూపించిన డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు రఘురామ. తన ఆరోగ్యం గురించి దేవుడికి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అంటూ ట్వీట్ చేశారు రఘురామకృష్ణం రాజు.