జ్యోతిష్యం: ఏ రెండు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది.. ఏ సమయంలో పుట్టిన వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు..!

జ్యోతిష్యం:  ఏ రెండు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది.. ఏ సమయంలో పుట్టిన వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు  అత్యంత కీలకమైనవి. రెండు విభిన్న స్వభావాలు కలిగిన గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు, అవి మానవ జీవితం, వ్యక్తిత్వం మరియు భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం  ఏ రెండు గ్రహాలు  కలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

​1. సూర్యుడు  + బుధుడు :  ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచరిస్తే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.   ఈ యోగ సమయంలో పుట్టిన వారు ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.  నవగ్రహాలకు రాజు అయిన సూర్యుడు అధికారం విషయంలో కీలకపాత్ర పోషిస్తాడు,.. బుధుడు బుద్దికారకుడు .. ఈ రెండు గ్రహాలు జాతకంలో  1, 4, 5, 7, 9, 10 స్థానాల్లో బలంగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ​ వీరిలో నాయకత్వ లక్షణాలతో పాటు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తారు.

​2. చంద్రుడు + గురువు : ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది.  ఈ యోగంలో పుట్టిన వారి సలహాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు.. ఙ్ఞానానికి కారణమైన గురువు కలిసి 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న వారికి ఏనుగు ఉన్న శక్తి ఉంటుందని పండితులు  చెబుతున్నారు.  వీరు ప్రశాంతమైన మనస్తత్వం, దయాగుణం,  సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే గుణం ఉంటుంది.
​
​3. సూర్యుడు + కుజుడు:   ఈరెండు గ్రహాల కలిసిన సంయంలో పుట్టిన వారు భయంలేని నాయకుడుగా చెలామణి అవుతారు.  వీరికి ప్రతి విషయంలో కూదా శక్తి, ధైర్యం చాలా ఎక్కువుగా ఉంటుంది.  ఈ రెండు మిత్రగ్రహాలు   కలవడం వల్ల విపరీతమైన శక్తి ఉద్భవిస్తుంది.
​వీరు అత్యంత ధైర్యసాహసాలు కలిగిన వారు. వీరికి భయం అంటే తెలియదు. ఎదురుదెబ్బలు తగిలినా వెనకడుగు వేయరు. అయితే, ఒక్కోసారి కోపం, మొండితనం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

​4. చంద్రుడు + రాహువు:  ఈ రెండు గ్రహాలు కలిసి  ఒకేరాశిలో సంచరించే సమయంలో జన్మించిన వారి  వ్యూహాలు ఇతరులకు ఏమాత్రం  అర్దంకావు. చంద్రుడు మనస్సుకు అధిపతి అయితే, రాహువు భ్రమలకు, అతీత శక్తులకు, సరిహద్దులు లేని ఆలోచనలకు కారకుడు.  ఈ రెండు గ్రహాలు  అనుకూల స్థానాల్లో ఉంటే ఇది విలక్షణమైన మేధస్సును ఇస్తుంది.

ALSO READ : 1960లో ఏం జరిగింది.. 2026, నవంబర్ 13న ఏం జరగబోతుంది

​
​5. బుధుడు + రాహువు: ఈ రెండు గ్రహాలు కలిసి సంచరించే సమయంలో జన్మించిన వారు ప్రతి విషయంలో కూడా లౌక్యంగా వ్యవహరిస్తారు.  బుధుడు లౌక్యానికి, వ్యాపారానికి కారకుడు. రాహువు ఆధునిక సాంకేతికతకు, షార్ట్‌కట్స్‌కు కారకుడు. ఈ ఇద్దరి కలయిక ప్రస్తుత డిజిటల్ యుగానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వీరు చాలా వేగంగా ఆలోచిస్తారు. సమయస్ఫూర్తి ఎక్కువ. అవతలి వారి మైండ్ గేమ్‌ను సులభంగా పసిగట్టగలరు.

​6. శుక్రుడు + గురువు: ఈరెండు గ్రహాలు చాలా మంచివి.  ఈ రెండు గ్రహాలు ఒకేరాశిలో సంచరించే సమయంలో జన్మించిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు .వీరి జీవితం రాజులా గడపాలని కోరుకుంటారు. మంచి అభిరుచులు ఉంటాయి. ఎంత ఖర్చు చేసినా, అంతకు రెట్టింపు సంపాదించే యోగం ఉంటుంది.

​7. కుజుడు + కేతువు:  ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరించే సమయంలో  పిశాచయోగం ఏర్పడుతుంది.  వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా వీరు ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి.  ఇతరులకు తెలియకుండా పావులు కదుపుతుంటారు.  అనవసర విషయాలకు శక్తిని వృధా చేయడం వలన కొన్ని ఇబ్బందులు పడతారు. 

​8. శని + గురువు: ఈ రెండు గ్రహాలు కలిసినప్పడు ర్మ-కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది.
 కర్మకారకుడైన శని, ధర్మకారకుడైన గురువు కలయిక అత్యంత పవిత్రమైనది. జీవితంలో క్రమశిక్షణ, న్యాయం, ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తుంది.  ఈ యోగంలో జన్మించిన వారు 
​ అత్యంత పరిణతి చెందిన  స్వభావం కలిగి ఉంటారు. వీరికి ఓర్పు, సహనం చాలా ఎక్కువుగా ఉంటుంది . చిన్న వయసులోనే పెద్దల మాదిరిగా  ఆలోచనలు చేస్తారు.

​9. శుక్రుడు + చంద్రుడు:  ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచరించేటప్పుడు జన్మించిన వారు చాలా  అద్భుతమైన సృజనాత్మకత కలిగి ఉంటారు.  వీరు చాలా అందంగా ఉంటారు.  వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువుగా ఉంటాయి. ఫ్యాషన్, అలంకరణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. 

10. సూర్యుడు + శని:  ఈరెండు గ్రహాలు తండ్రీ కొడుకులు. సూర్యుడు వెలుగును ఇస్తే, శని చీకటిని.. క్రమశిక్షణను సూచిస్తాడు. ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచరించే సమయంలో పుట్టిన వారి  జీవితంలో తీవ్రమైన సంఘర్షణ ఉంటుంది.  చిన్నతనం నుండి బాధ్యతలు మోయాల్సి వస్తుంది. తండ్రితో కొన్ని విభేదాల వలన  దూరంగా ఉంటారు.  లేదా చిన్నవయస్సులో తండ్రి మరణం జరుగుతుంది. ఎంతటి కష్టం వచ్చినా  విపరీతమైన పట్టుదల కలిగి కలిగి ఉంటారు. వీరి జీవితం తొలిదశలో కష్టాలు ఉన్నప్పటికీ, 36 సంవత్సరాల వయసు దాటిన తర్వాత స్వయంకృషితో సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. పొలిటికల్ లీడర్లుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు.

​11. గురువు + కుజుడు: ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచరించే సమయంఓ గురు-మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో  జన్మించిన వారు  నీతి, నిజాయితీలకు ప్రాధాన్యం ఇస్తారు. అన్యాయాన్ని సహించరు. సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉంటుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

​