పెళ్లిళ్లు, విడాకులపై వ్యక్తిగత విమర్శలు, కామెంట్స్ చేయొద్దు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన

పెళ్లిళ్లు, విడాకులపై వ్యక్తిగత విమర్శలు, కామెంట్స్ చేయొద్దు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, అనుచరులు, అభిమానులకు ప్రత్యేకంగా నోట్ రిలీజ్ చేసింది. ఎవరిపైనా వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది పార్టీ హైకమాండ్. టీవీ చర్చల్లో.. యూట్యూబ్ ఛానెళ్లల్లో పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించొద్దని.. ఆ అంశాన్ని ఆయన వ్యక్తిగతంగా చూడాలని.. ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు, కామెంట్స్ చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పష్టం చేసింది.

పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన క్రమంలో.. సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు విమర్శిస్తుంటే మరి కొందరు మద్ధతిస్తూ.. సోషల్ మీడియా మొత్తం పవన్ విడాకుల వ్యవహారమే ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో వ్యవహారాన్ని వ్యక్తిగతంగా చూడాలని.. పార్టీ శ్రేణులకు నాలుగు పాయింట్లతో కూడిన ఆదేశాలను వైసీపీ  జారీ చేసింది.

నాలుగు రూల్స్ పాటించాల్సిందే:

1. వ్యక్తిగత అంశాలపై పబ్లిక్ కామెంట్స్, స్టేట్ మెంట్స్ ఇవ్వకుండా దూరంగా ఉండాలి
2. సోషల్ మీడియాలో ఆ పోస్టులకు సంబంధించిన చర్చలు, స్పందనలకు దూరంగా ఉండాలి
3. వ్యక్తిగత అంశాలకు సంబంధించిన పోస్టులు, కంటెంట్ షేర్ చేయకూడదు
4. ప్రజాజీవితంలో గౌరవ ప్రదంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ఈ గైడ్ లైన్స్ అందరూ పాటించాలని చెబుతూ శ్రేణులకు వైసీపీ ఆదేశాలు జారీ చేసింది.