Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు

అమరావతి:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన భార్య అనా కొణిదెలతో విడిపోతున్నట్లు ప్రకటించారు. గత 13 ఏళ్లుగా కొనసాగుతున్న తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇద్దరూ కలిసి ప్రకటన విడుదల చేశారు. సోమవారం (నవంబర్ 9) రాత్రి ఈ ప్రకటన వెలువడింది. పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల స్పష్టం చేశారు.

తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల వెల్లడించారు. తమ పిల్లల బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తామని  తెలిపారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు తమకు ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, తమపై సానుభూతితో వ్యవహరించాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

2013లో వివాహం.. ఇద్దరు పిల్లలు

పవన్ కల్యాణ్, అనా కొణిదెల 2013 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజినోవా వివాహం అనంతరం అన్నా  కొణిదెలగా  మార్చుకున్నారు. పవన్ కల్యాణ్ నటించిన 'తీన్ మార్' సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.వీరిద్దరికీ ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పిల్లల భవిష్యత్తు, సంతోషం తమ ఉమ్మడి బాధ్యతగా ఉంటుందని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం

పవన్ కల్యాణ్ గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1997లో నందినిని వివాహం చేసుకోగా, 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2009లో నటి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2012లో వీరి విడాకులు పూర్తయ్యాయి.ఆ తర్వాత 2013లో అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు 13 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం అన్నా కొణిదెలతో విడిపోతున్నట్లు ప్రకటించారు.