యాదాద్రిలో ఈ నెలంతా సత్యనారాయణ స్వామి వ్రతాలు : బ్యాచ్ సమయాలు ఇవే..!

యాదాద్రిలో ఈ నెలంతా సత్యనారాయణ స్వామి వ్రతాలు : బ్యాచ్ సమయాలు ఇవే..!

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీకమాసం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో ప్రతి ఏటాసత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి.  ఈ ఏడాది ( 2026) నవంబర్ 10 వ తేదీనుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో  ఉంచుకొని వ్రతాల బ్యాచుల సంఖ్యను పెంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.   

ప్రతి ఏడాది నాలుగు బ్యాచ్ ల్లో  వ్రతాలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది ఆరు బ్యాచుల్లో నిర్వహిస్తున్నారు.  కార్తీక పౌర్ణమి రోజు  ఎనిమిది బ్యాచ్ ల్లో జరుగుతాయి. ఈ ఏడాది  భక్తుల సౌకర్యార్థం వ్రతాల సమయాల్లో మార్పులు చేశారు.

  • మొదటి బ్యాచ్:ఉదయం 7:00 నుండి 8:00 గంటల వరకు
  •  రెండవ బ్యాచ్:ఉదయం 9:00 నుండి 10:00 గంటల వరకు
  •  మూడవ బ్యాచ్:ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
  • నాలుగో బ్యాచ్:మధ్యాహ్నం 1:00 నుండి 2:00 గంటల వరకు
  •  ఐదవ బ్యాచ్:మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు
  •  ఆరవ బ్యాచ్:సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల వరకు