రూ.500 నోట్ల రద్దు చేయాలి : సీఎం చంద్రబాబు

రూ.500 నోట్ల రద్దు చేయాలి : సీఎం చంద్రబాబు

రాజకీయాల్లోనే కాదు.. సమాజంలోనూ అవినీతి పోవాలంటే.. అవినీతి కంట్రోల్ కావాలంటే 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు ఓ మార్గం అని.. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న 500 రూపాయల నోట్లు రద్దు చేసినట్లయితే.. అవినీతి తగ్గిపోతుందన్నారు సీఎం చంద్రబాబు. 

నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ఉత్తమమైన మార్గం అని.. ప్రతి ఒక్కరూ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందంటూ తన విజన్ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. పెద్ద నోట్లు అంటే 100, 200 రూపాయల నోట్లు మాత్రమే ఉండాలని.. అంతకు మించి ఉండాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. గతంలో 2 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశానని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం 2 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేసినట్లు వెల్లడించారాయన. ఇప్పుడు కూడా అదే విధంగా 500 నోట్ల రూపాయలను రద్దు చేసినట్లయితే అవినీతి తగ్గుతుందన్నారు సీఎం చంద్రబాబు. 

ALSO READ : స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం..

ప్రజలు అందరూ డిజిటల్ కరెన్సీని వైపు మళ్లాలని.. అప్పుడే అవినీతి తగ్గుతుందని చెప్పుకొచ్చారాయన. రాబోయే రోజుల్లో అవినీతిపై యుద్ధం చేస్తామని.. ఆ దిశగా నోట్ల విషయంలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు.