Anju Kurian Wedding: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి.. హీరోయిన్ అంజు కురియన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Anju Kurian Wedding: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి.. హీరోయిన్ అంజు కురియన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

మలయాళి నటి అంజు కురియన్ తన ప్రియుడు రోషన్ కరిప్పాపరంబిల్‌తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. శనివారం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా తన మనసులో దాచుకున్న కల నిజమైందంటూ అంజు సోషల్ మీడియాలో వేదికగా భావోద్వేగ పోస్ట్ చేసింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని అక్షరాల్లో వ్యక్తం చేసింది. "ఎన్నో రోజులుగా దేవుడిని ప్రార్థించిన వ్యక్తిని ఈ రోజు వివాహం చేసుకుంటున్నాను. నా జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం మొదలవుతోంది. ఇది కేవలం రెండు మనసుల మధ్య ఇచ్చుకున్న మాట మాత్రమే కాదు.. దేవుడి సాక్షిగా చేసుకున్న పవిత్రమైన ప్రమాణం. చిన్నప్పటి నుంచి నా మనసులో దాచుకున్న కల ఇప్పుడు నిజమైంది. అంతులేని నవ్వులు, ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఎదగడం, జీవితాంతం తోడుగా ఉండటం.. ఇదే నా కలల ప్రపంచం" అంటూ భావోద్వేగానికి గురైంది.

అంజు పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. పెళ్లి ఫొటోల్లో అంజు ఆనందం, కొత్త జీవితంపై ఆమెకున్న ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే రోషన్‌తో ఆమె ప్రేమ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? వీరిద్దరి పరిచయం ఎలా ఏర్పడింది? వంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇక అంజు కురియన్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో వచ్చిన 'నేరం' సినిమాతో సహాయ పాత్రలో పరిచయమైంది. ఆ తర్వాత 'ఓం శాంతి ఓషానా', 'కవి ఉద్దేశిచత్తు', 'నజాన్ ప్రకాశన్', 'ఇగ్లూ' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.  తెలుగులో 'ఇదమ్ జగత్ ' నటించింది. ఇటీవల సైజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరామ్'లోనూ కనిపించింది. తెరపై తన నటనతో ఆకట్టుకున్న అంజు.. ఇప్పుడు నిజ జీవితంలో కొత్త పాత్రలోకి అడుగుపెట్టింది. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anju Kurian (Ju) (@anjutk10)