మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన వ్యక్తిని... ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు..!

మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన వ్యక్తిని... ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు..!

పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో తన మేనకోడలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన వ్యక్తిని సోమవారం ( నవంబర్ 9 ) ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిపారు పోలీసులు. రాయ్‌గంజ్‌లోని ఒక గ్రామంలో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై నిందితుడు దిలీప్ రాయ్ కాల్పులు జరిపాడని.. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని తెలిపారు పోలీసులు. 

పోలీసుల కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు పోలీసులు. అతడిని రాయ్‌గంజ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్దారించారని  తెలిపారు పోలీసులు

కులిక్ నది సమీపంలోని అడవిలో బాలిక నగ్న, పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహం లభించిన కేసులో పోలీసులు నాలుగు రోజులు గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు పోలీసులు.నిందితుడు గౌరీ గ్రామ పంచాయతీ ప్రాంతంలో దాక్కున్నాడని సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించి అతడిని పట్టుకున్నారు. 

రాయ్ పూర్వీకుల ఇల్లు జార్ఖండ్‌లో ఉందని, అతను బీహార్ సరిహద్దు గుండా పశ్చిమ బెంగాల్ నుండి పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపారు పోలీసులు. గత నాలుగురోజులుగా నిందితుడి కోసం గాలించి ఇవాళ తెల్లవారుజామున పట్టుకున్నామని అన్నారు. 

బెంగాల్-బీహార్ సరిహద్దు సమీపంలో నిందితుడిని గుర్తించామని.. ఆ సమయంలో దిలీప్ రాయ్ తమ బృందంపై కాల్పులు జరపగా... ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపామని తెలిపారు పోలీసులు.