చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీసు దగ్గర భారీ అగ్నిప్రమాదం.. పాత పట్వారి భవనంలో తగలబడ్డ కీలక రికార్డులు..

చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీసు దగ్గర భారీ అగ్నిప్రమాదం.. పాత పట్వారి భవనంలో తగలబడ్డ కీలక రికార్డులు..

చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీసు దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు రావడంతో ఎమ్మార్వో ఆఫీసు పక్కనే ఉన్న పాత పట్వారి భవనంలో పాత రికార్డులు తగలబడ్డాయి. సోమవారం ( నవంబర్ 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... 

చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీసు దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎమ్మార్వో ఆఫీసు పక్కనే ఉన్న పాత పట్వారి భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవనంలో ఉన్న పాత రికార్డులు అన్ని తగలబడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భవనాన్ని స్టోరేజ్ రూమ్ గా ఉపయోగిస్తుండగా..అందులో భద్రపరిచిన పాత రికార్డులు, ఇతర సామాగ్రి మంటల్లో పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్థి నష్టం వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.