కోతికి కొబ్బరి చిప్ప అంటే ఇదేనేమో.. పాక్ ఆటగాళ్ల సెలెబ్రేషన్స్పై పిచ్చ పిచ్చ ట్రోలింగ్ !

కోతికి కొబ్బరి చిప్ప అంటే ఇదేనేమో..   పాక్ ఆటగాళ్ల సెలెబ్రేషన్స్పై పిచ్చ పిచ్చ ట్రోలింగ్ !

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఎగిరెగిరి పడుతుందో అలా ఉంది పాక్ ఆటగాళ్ల వెర్రి. కేవలం అండర్ 19లో ఒక మ్యాచ్ గెలిచారు. కప్ కూడా కాదు. దానికే.. వరల్డ్ కప్ సాధించినంత బిల్డప్ ఇస్తూ గ్రౌండ్ లో పాక్ ప్లేయర్లు చేసిన ఓవర్ యాక్షన్ కాస్త బూమరాంగ్ అయ్యింది. ఇండియా ప్లేయర్లను గేలి చేసేందుకు ప్రయత్నిస్తే అది తిరిగి సోషల్ మీడియా ట్రోలింగ్ రూపంలో వాళ్లకే తగులుకుంది. 

ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన అండర్19 ఆసియా కప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో..  పాకిస్థాన్ యువ జట్టు భారత్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ గెలుపు తర్వాత  పాక్ ఆటగాళ్లు పిచ్చెక్కినట్లు సంబరాలు చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఆదివారం (2026 నవంబర్ 8) జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ రాజ్‌పుత్ 85 బంతుల్లో 107 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. పాక్ బౌలర్లు అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్ ఒక్కొక్కరు మూడేసి వికెట్లు తీశారు.

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే కుప్పకూలింది. 61 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి పడిపోయి ఒత్తిడిలో పడింది. అయితే వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ హంజా జహూర్ అద్భుతంగా ఆడి జట్టును కాపాడాడు. అతను 108 బంతుల్లో  100 పరుగులు చేశాడు. హస్నైన్ అబ్బాస్ దార్ (38)తో కలిసి 6వ వికెట్‌కు 107 పరుగుల పాట్నర్షిప్ నెలకొప్పాడు. చివరకు పాక్ 48.1 ఓవర్లలో 209/7తో గెలిచింది. 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ప్లేయర్ల వెకిలి చేష్టలు:

హంజా జహూర్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే పిచ్చెక్కినట్లు సెలబ్రేట్ చేయడం వైరల్ గా మారింది.  నికాబ్ షఫీక్ బ్యాట్ విసిరేసి పరుగెత్తుకొచ్చి కౌగలించుకున్నాడు. జట్టు మొత్తం ఉత్సాహంతో ఊగిపోయింది.   ఆసక్తికరంగా, మ్యాచ్‌కు ముందు హంజా ఒక నోట్ రాసుకున్నాడు. రేపు 50 రన్స్ చేసి పాక్ నుగెలిపిస్తానని.  ఆ నోట్‌ను విజయం తర్వాత కెమెరాలకు చూపించాడు. అయితే 50కి బదులు సెంచరీ కొట్టి పాక్ దృష్టిలో హీరోగా నిలిచాడు.

ALSO READ : రాహుల్ కంటే ముందే అక్షర్‌?.. గంభీర్ ప్రయోగంలో తప్పేమీ లేదు..

అయితే వీళ్లు చేసిన అతి ఇప్పుడు ఫుల్లుగా ట్రోల్ అవుతోంది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఉందని ఇండియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బావిలో కప్పల్లాగా.. చిన్న పాటి గెలుపుకే ఇంతలా పొంగిపోవాల్సిన పనిలేదని కామెంట్స్ చేస్తున్నారు. గెలిస్తే సెలెబ్రేట్ చేసుకోవాలి.. పిచ్చెక్కినట్లు గెంతులేసి అసహ్యం వచ్చేలా ప్రవర్తించడం కాదనంటూ కామెంట్స్ చేస్తున్నారు.