సీఎం రేవంత్ రెడ్డికి మోదీ స్పెషల్ విషెస్..కొడంగల్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్

సీఎం రేవంత్ రెడ్డికి మోదీ స్పెషల్ విషెస్..కొడంగల్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్

 సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,  ఏపీ సీఎం సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రత్యేక పోస్టు చేశారు. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.  

అంతేకాకుండా, సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. ప్రస్తుతం దేశం అమృత్ కాలంలో ఉందని, వేగవంతమైన అభివృద్ధి, సమగ్రత దిశగా ముందుకు సాగుతోందని లేఖలో ప్రస్తావించారు.

ఈ కీలక సమయంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి తనవంతు కృషిని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని ప్రత్యేక పోస్టుతో పాటు లేఖ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియజేయడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మరో వైపు రేవంత్ రెడ్డి తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. కొడంగల్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.