అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమి తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. వైట్ హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా స్టీఫెన్ ముల్లర్ ను నియమించారు. నవంబర్ 9, 2026న మిల్లర్బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఉన్న సుసీ వైల్స్ స్థానంలో మిల్లర్ ను నియమించారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక మార్పును ప్రకటించడం చర్చనీయాంశమైంది. స్టీఫెన్ మిల్లర్ ఇప్పటివరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందిస్తున్నారు.
