మీ ఫోన్లో ఎక్కువగా ఇంటర్నెట్ వాడకపోయినా, సిమ్ కార్డు మాత్రం యాక్టివ్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఒకోసారి ముఖ్యంగా సెకండ్ సిమ్ వాడేవారికి ఎక్కువ డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ల కోసం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ధరలో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
టెలికాం వినియోగదారులకు తక్కువ ఖర్చుతో సిమ్ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కూడా వాయిస్ కాల్స్, SMSలతో కూడిన ప్రత్యేక ప్లాన్‌లను అందించాలని టెలికాం కంపెనీలకు సూచించింది. ఈ ప్లాన్‌లలో ఇంటర్నెట్ డేటా ఉండదు. కానీ డేటా అవసరం లేని కస్టమర్లు తక్కువ ధరతో సిమ్ అక్టీవ్ గా కొనసాగించవచ్చు. అవసరమైతే విడిగా డేటా ప్యాక్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. మరి జియో, ఎయిర్‌టెల్, విఐ అందిస్తున్న తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లు ఏంటో చూద్దామా.....
1. జియో రూ.147 రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో రూ.147 ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 22 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం 300 SMSలు కూడా ఫ్రీగా వస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా ఉండదు. డేటా అవసరమైతే అదనంగా డేటా వోచర్ రీఛార్జ్ చేసుకోవాలి. దింతో మీకు రోజుకు అయ్యే ఖర్చు సుమారు రూ.6.68 మాత్రమే.
2. ఎయిర్‌టెల్ రూ.185 రీఛార్జ్ ప్లాన్
భారతి ఎయిర్‌టెల్ రూ.185 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది. అలాగే మొత్తం 300 SMSలు పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఎలాంటి డేటా ఉండదు. అంటే ఇంటర్నెట్ ఉపయోగించాలంటే ప్రత్యేకంగా డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ తో మీకు రోజుకు అయ్యే ఖర్చు సుమారు రూ.6.61.
3. వోడాఫోన్ ఐడియా (Vi) రూ.142 రీఛార్జ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా అందిస్తున్న రూ.142 ప్లాన్ ఈ మూడు ప్లాన్‌లలో తక్కువ ధర ఉన్న ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. దీనితో పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 300 SMSలు పొందవచ్చు. అయితే ఇందులో కూడా ఇంటర్నెట్ డేటా ఉండదు. డేటా అవసరమైనప్పుడు విడిగా డేటా బూస్టర్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో మీకు రోజుకు అయ్యే ఖర్చు సుమారు రూ.5.07.
ఈ మూడు ప్లాన్‌లలో ఏది తక్కువ ధర ?
ఈ మూడు టెలికాం కంపెనీల ప్లాన్‌లను పోల్చి చూస్తే, వోడాఫోన్ ఐడియా (Vi) రూ.142 ప్లాన్ తక్కువ ధరలో ఉంది. అంతేకాకుండా 28 రోజుల వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. జియో రూ.147 ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, ఎయిర్‌టెల్ రూ.185 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది.
ఎవరికి ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి?
ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించని వారికి, సెకండ్ సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి. కాల్స్, SMSలు మాత్రమే అవసరమయ్యే వారు కూడా ఈ ప్లాన్స్ తీసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరమైనప్పుడు విడిగా డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండటంతో, డేటా అవసరం లేనప్పుడు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
