ఫిబ్రవరి16 నుంచి CBSE 10,12th ఎగ్జామ్స్.. షెడ్యూల్ రిలీజ్, చెక్ డిటెయిల్స్

ఫిబ్రవరి16 నుంచి CBSE 10,12th ఎగ్జామ్స్.. షెడ్యూల్ రిలీజ్, చెక్ డిటెయిల్స్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యాసంవత్సరానికి గాను10,12 తరగతి బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 16 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు CBSE అధికారిక వెబ్ సైట్ cbse.gov.in ని సందర్శించి పరీక్షల తేదీల షీట్ PDF ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. 

ఎగ్జామ్స్ డేట్స్ తోపాటు సీబీఎస్ ఈ 10,12 వ తరగతి  ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్ ను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మోడల్ పేపర్లను అధికారిక వెబ్‌సైట్ - cbseacademic.nic.inలో చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  సబ్జెక్టుల వారీగా మోడల్ పేపర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు తరగతి వారీగా సబ్జెక్టుల వారీ మోడల్ పేపర్ లింక్‌పై క్లిక్ చేసి పీడీఎఫ్ ఫార్మెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.