ఏఆర్సీఐలో టెక్నికల్ ఖాళీలు.. ఐటీఐ, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు అవకాశం

ఏఆర్సీఐలో టెక్నికల్ ఖాళీలు.. ఐటీఐ, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు అవకాశం

ఇంటర్నేషనల్ అడ్వాన్స్​డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సీఐ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి  నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. 
మొత్తం ఖాళీలు:  29.
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్–-బి (ఆర్ & డీ) 4, ఆఫీసర్–-బి 1, టెక్నికల్ అసిస్టెంట్-–ఏ 6, టెక్నీషియన్–-ఏ 9, డ్రైవర్–-ఏ 2.

విద్యార్హతలు

సైంటిస్ట్–బి:  మెటీరియల్స్ ఇంజినీరింగ్ / మెటలర్జీ / మెకానికల్ ఇంజినీరింగ్‌‌లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.  మాస్టర్స్ డిగ్రీ ఉంటే ప్రాధాన్యం ఉంటుంది.
ఆఫీసర్–బి (ఫైనాన్స్ & అకౌంట్స్):  మంచి అకడమిక్ రికార్డుతో కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ. కేంద్ర/ 
రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అటానమస్ సంస్థల్లో ఇదే హోదాలో పనిచేస్తున్న వారు లేదా నిర్దిష్ట పే లెవెల్స్​లో నిర్ణీత సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులు.
టెక్నికల్ అసిస్టెంట్–ఏ: ఫిజికల్ సైన్సెస్ (కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా)లో బీఎస్సీ లేదా మెటలర్జీ / మెకానికల్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌‌లో  డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 
అసిస్టెంట్ –ఏ:  మార్కులతో కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ.  మూడేళ్ల  పని అనుభవం ఉండాలి. 
టెక్నీషియన్–ఏ: ఫిట్టర్ / టర్నర్ / ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌‌లో ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల టెక్నికల్ అనుభవం ఉండాలి.
డ్రైవర్–ఏ: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ వెహికల్స్ నడపడంలో మూడేళ్లు, హెవీ వెహికల్స్ నడపడంలో ఆరేళ్ల అనుభవంతోపాటు వాహన మెకానిజంపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 21.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్arci.res.in/careers/vacanciesను సందర్శించండి.