దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో రూపొందిన తాజా చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ మొలక నిర్మించారు. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. తాజాగా రాకెట్ రివీల్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
చిత్ర సమర్పకులు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ఎనర్జిటిక్ టీమ్ అంతా ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ఎంతో ఇన్నోసెన్స్ ఉన్న సినిమా ఇది. లాజిక్స్ ఉండవు. సెన్స్ ఉండని నాన్ సెన్స్ కామెడీ ఉంటుంది. కానీ వెరీ సెన్సిబుల్ మూవీ ఇది. చంద్రయాన్ భారత్ సత్తాను ప్రపంచానికి ఎలా చాటిందో ఈ చంద్రయాన్ టీమ్ అందరి టాలెంట్‌ను ఇండస్ట్రీకి తెలియజేస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
ఏదైనా సాధించేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లే నలుగురు కుర్రాళ్ల కథ ఇదని నటులు శివకుమార్, రవి శివతేజ, లోకేష్ అన్నారు. ఇది తనకు చాలా స్పెషల్ మూవీ అని హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని చెప్పింది. థియేటర్లలో నవ్వుల హంగామా గ్యారెంటీ అని దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్, ప్రవీణ్ మొలక అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
