- నిర్మల్ జిల్లాలో ఘటన
నిర్మల్, వెలుగు: చిన్నారుల లైంగిక వీడియోలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా మామడ మండలం కమల్కోట్గ్రామానికి చెందిన యువకుడితోపాటు సోన్ మండలం సాకెర గ్రామానికి ఎందిన మరో యువకుడు ఆల్లైన్వెబ్సైట్ల నుంచి చిన్నారులకు సంబంధించిన లైంగిక వీడియోలను డౌన్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా డౌన్లోడ్ చేసిన వీడియోలను వారు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అప్లోడ్ చేసి వైరల్ చేస్తున్నారన్నారు.
ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని వివరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, లైంగిక వీడియోలకు సంబంధించి డౌన్లోడ్చేయడం, భద్రపర్చడం, ఇతరులకు పంపడం లేదా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
