వర్క్ ప్లేస్ లో మహిళల భద్రతపై ఎన్ హెచ్ఆర్సీ గైడ్లైన్స్ 

వర్క్ ప్లేస్ లో మహిళల భద్రతపై ఎన్ హెచ్ఆర్సీ గైడ్లైన్స్ 
  • తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల సీఎస్‌‌‌‌లకు ఆదేశాలు
  • రెండు నెలల్లో అమలు పురోగతిపై నివేదికలు సమర్పించాలని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను  పటిష్టం చేసేందుకు నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ) గైడ్ లైన్స్ జారీ చేసింది. మహిళల భద్రతకు 8 ప్రధాన అంశాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని 10 మంత్రిత్వ శాఖలు, రైల్వే బోర్డు చైర్మన్, తెలంగాణలతో పాటు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల  సీఎస్ లకు ఆదేశాలు పంపింది. ఈ గైడ్ లైన్స్ ఆధారంగా చేపట్టిన చర్యలను రెండు నెలల్లోగా సమర్పించాలని మంగళవారం స్పష్టం చేసింది.

పీరియాడిక్‌‌‌‌ లేబర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ పార్టిసిపేషన్‌‌‌‌ సర్వే (పీఎల్ఎఫ్పీఎస్), నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ల తాజా నివేదికలపై ఎన్​హెచ్​ఆర్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల హక్కుల పరిరక్షణకు కఠిన చట్టాలు అమల్లో ఉన్నా పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వారి భద్రత ఇప్పటికీ ప్రమాదకంగానే ఉందని అభిప్రాయపడింది. ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌బీ–2026 తాజా రిపోర్ట్ లో మహిళలపై నేరాలకు సంబంధించి సుమారు 4.4 లక్షల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 

8 అంశాలపై ఫోకస్.. 

వర్స్ ప్లేస్ లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతకోసం 8 అంశాలతో  గైడ్ లైన్స్ ను రూపొందించింది. ఇందులో లైంగిక వేధింపులపై అవగాహన, మౌలిక వసతుల కల్పన, బాధితులకు సహాయం అందించడం వంటి చర్యలను ప్రస్తావించింది. ఈ సూచనలను అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మహిళా, శిశు అభివృద్ధి, విద్య, హోం వ్యవహారాలు, సమాచార, ప్రసారాలు, కార్మిక, ఉపాధి, కార్పొరేట్‌‌‌‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారులు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలతో పాటు రైల్వే బోర్డు పై ఉందని గుర్తు చేసింది.