బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది వామికా గబ్బి. ఈ ఏడాది ఇప్పటికే తను నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రీసెంట్‌గా రిలీజైన ‘ప్రహార్’లో యాభై ఏళ్ల మహిళగా ఆమె నటించింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో తన గెటప్‌కు సంబంధించిన ప్రోస్తటిక్ మేకప్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వామికా.. ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
‘మేకప్ పూర్తయ్యాక అద్దంలో చూసుకుని. ఇది నేనేనా అని నమ్మలేకపోయా. ముఖంపై ప్రోస్తటిక్ మేకప్, దుస్తుల కింద ప్యాడింగ్ ఉండటంతో నన్ను నేను గుర్తుపట్టడమే కష్టమైపోయింది. అదొక విచిత్రమైన, అద్భుతమైన అనుభూతి’ అని వామికా చెప్పింది.
‘ఈ సినిమా ఒప్పుకోడానికి చాలా భయమేసి నో చెప్పేందుకు చాలా కారణాలు వెతుక్కున్నానని, కానీ స్క్రిప్ట్ చదివాక ఓకే చెప్పేందుకు మరిన్ని బలమైన కారణాలు దొరికాయని వామిక వెల్లడించింది. ఫస్ట్ టైమ్ ఓ మహిళ జీవితంలోని మూడు దశాబ్ధాలను ఒకేసారి ఫీల్ అయ్యే అవకాశం లభించిందని, శరీరంలో వచ్చే మార్పులు, ముఖంపై వయసు ప్రభావం, మారుతున్న ఆమె కలలు లాంటివన్నీ ఫీల్ అయ్యానంది వామికా. 30 ఏళ్ల వయసులో ఆమె ఎలా ఉండేదో, జీవితం ఆమెను 50 ఏళ్ల వయసులో ఎలా మార్చిందనే లైఫ్ జర్నీని చూశానని, జ్యోతి అనే ఈ క్యారెక్టర్ ద్వారా తన గురించి తాను కొత్త విషయాలు తెలుసుకున్నానని, కొన్ని పాత్రలు ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయని వామికా గబ్బి చెప్పుకొచ్చింది.
